'ఆదిపురుష్' నుంచి 'తూ హై శీతల్ ధారా' ఫుల్ సాంగ్ వీడియో!

  • 'ఆదిపురుష్'కి బాణీలను అందించిన అజయ్ - అతుల్ 
  •  ఫరవాలేదనిపించుకున్న పాటలు 
  • మరింతగా కనెక్ట్ అయిన 'తూ హై శీతల్ ధారా' సాంగ్ 
  • కొంతసేపటికి క్రితం రిలీజ్ చేసిన టీమ్
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ నేపథ్యంలోను .. పౌరాణిక చిత్రాల జాబితాలోను ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఇదే. ఓం రౌత్ కొన్ని కీలకమైన అంశాలను మార్చడం వలన .. ఫస్టాఫ్ ను చకచకా లాగించేసి సెకండాఫ్ లో చాలా వరకూ యుద్ధానికి కేటాయించడం విమర్శలకు దారి తీసింది. 

అయితే ఓం రౌత్ మార్చిన లుక్స్ .. సన్నివేశాల సంగతి అలా ఉంచితే  ఈ సినిమాకి పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ కొంతవరకూ హెల్ప్ అయ్యాయి. పాటల్లోని విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి.  అజయ్ - అతుల్ అందించిన బాణీలు అహో అనే స్థాయిలో లేకపోయినా, ఆ సందర్భానికి తగిన అనుభూతిని కలిగిస్తాయి. 

అలాంటి పాటల్లో ఒకటిగా 'తూ హై శీతల్ ధారా' ఒకటిగా కనిపిస్తుంది. నదీ ప్రవాహం .. కొండలు .. పక్షులు .. వనాలు .. వీటిని చూస్తూ సీతారాములు పరవశించిపోయి పాడుకునే పాట ఇది. సోను నిగమ్ - శ్రేయ ఘోషల్ కలిసి ఆలపించిన ఈ పాట అందంగా సాగుతుంది. ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితమే హిందీ వెర్షన్ కి సంబంధించిన ఫుల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేసింది.


Prabhas
Krithi Sanon
Sunny Singh
Adipurush

More Telugu News